తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది. శ్రీవారికి ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి అమ్మవారు భక్తులను కనువిందు చేశారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా వేడుక చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనసేవలు జరగనున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







