Liquor Scam : ఢిల్లీలో డొంక కదిలితే .. తెలుగు రాష్ట్రాల్లో మూలాలు-లిక్కర్ స్కామ్ పై జీవీఎల్

UPDATED 24th AUGUST 2022 WEDNESDAY 02:30 PM

Liquor Scam : లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీలో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణలోమూలాలు దొరికాయని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ… రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించటంలేదని ఆయన పశ్నించారు.

అనంతపురం జిల్లాలో ఎంతో విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను కేవలం రూ. 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజెక్కించుకోవటం అడ్డగోలు వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. ఈల్యాండ్ స్కాం పై జగన్ ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

భూములను ఏ వినియోగం కోసం ఇచ్చారు… ల్యాండ్ ఎగ్రిమెంట్ పై జరిగిన అంశాలను తెలపాలని ఆయన కోరారు. విశాఖ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో సుమారు 50 వేల ఓట్లను తొలగించినట్లు తమ దృష్టికి వచ్చిందని… దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని జీవీఎల్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us