Updated 3rd February 2023 Friday 06:05 pm
AP News: ఏపీలో రేషన్ కార్డులున్న వారికి 2024 నుంచి రేషన్ తో పాటు రాగులు, జొన్నలు ఇస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం రైతులు జొన్నలు, రాగులు సాగు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. రేషన్ కార్డుదారులకు పైలట్ ప్రాజెక్టుగా గోధుమ పిండిని కొన్ని చోట్ల పంపిణీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే రాష్ట్రమంతా దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక, దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.







