Prashant Kishor: కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన పీకే!

UPDATED 26th APRIL 2022 TUESDAY 04:00 PM

Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరడం లేదని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను పీకే తిరస్కరించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ‘ఎంవర్డ్ యాక్షన్ గ్రూప్-2024’లో చేరాల్సిందిగా పీకేను కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే, ఈ ప్రతిపాదనను పీకే తిరస్కరించారు. పార్టీని ముందుకు నడిపించడంలో తనకు స్వేచ్ఛ ఇవ్వాలని పీకే కోరినట్లుగా, కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో పీకే కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

‘ఎంవర్డ్ యాక్షన్ గ్రూప్-2024’ అనేది రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న పార్టీ టీమ్. కాంగ్రెస్‌లో చేరేందుకు పీకీ నిరాకరించినట్లుగా, ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పీకే పలు ప్రాంతీయ పార్టీలకోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్‌ కోసం ఆయన పని చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us