UPDATED 22nd JULY 2017 FRIDAY 6:00 PM
పెద్దాపురం : తైక్వాండో లో ఎస్ ఆర్ ఆర్ కళాశాల విద్యార్థి ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ వి.ఎస్. చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో తృతీయ సంవత్సరం బికామ్ చదువుతున్న ఎన్. సతేంద్ర ఈ నెల 15 నుంచి 18 వరకు ఇంటర్ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్ ట్రోఫీ లో కాంస్య పతకం సాధించినట్లు ఆయన తెలిపారు. 87 కిలోల విభాగంలో తమ విద్యార్థి ఈ పతకం సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పతకం సాధించిన విద్యార్థిని కళాశాలలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం. చక్రం, కె.వి.ఆర్.మూర్తి, పి.ఏసుబాబు, పి. మధుసూధనరావు, విద్యార్థులు పాల్గొన్నారు.







