ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం

*ఉత్సాహంగా పాల్గొన్న ఆదిత్య విద్యార్థులు

UPDATED 21st SEPTEMBER 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల లక్ష్మీఆదిత్య హాస్టల్ లో గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని నిలిపిన వినాయక విగ్రహాన్ని శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. గత తొమ్మిదిరోజులుగా పూజలందుకున్న గణనాధుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాన్ని విద్యార్థులు మేళతాళాలతో, నృత్యాలతో, బాణాసంచాతో గణపతి బప్పా మోరియా అంటూ ఊరేంగింపుగా తీసుకొని వెళ్లి సామర్లకోటలో గల గోదావరి కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, సిఏవో కృష్ణమూర్తి, క్యాంపస్ ఇంచార్జ్ మేడపాటి భాస్కర చంద్రారెడ్డి, చీఫ్ వార్డెన్, ఇతర వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా సాగింది.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us