UPDATED 25th APRIL 2018 WEDNESDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్న డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు ఇటీవల కాకినాడ జె.ఎన్.టి.యు నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్ డి పట్టా తీసుకొన్న సంగతి విదితమే. ఈ సందర్భంగా శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి సభ్యులు శ్రీనివాసరావును అభినందించి దుశ్శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాసరావు భవిష్యత్ లో మంచిస్థాయికి చేరుకుని మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలన్నారు. అలాగే సమితి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని తగు సూచనలు, సలహాలను అందిస్తూ సమాజహిత కార్యక్రమాలు చేసేవిధంగా సభ్యులను ప్రోత్సహించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్, సభ్యులు జొన్నలగడ్డ పవన్, ఎం. రాజేష్, శర్మ, కేదారశెట్టి సతీష్, జి. ప్రకాశరావు, కూనిరెడ్డి శ్రీనివాస్, పున్నం నాగేశ్వరావు, ఎన్. ప్రసాద్, పి. సత్యనారాయణ రెడ్డి, ఆనందమోహన్, ఎస్. జగదీష్, తదితరులు పాల్గొన్నారు.







