శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 31st MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో పొందిన శిక్షణను గ్రామస్థాయిలో వినియోగించి తద్వారా సత్ఫలితాలు సాధించాలని విస్తరణ శిక్షణా కేంద్రం ట్రైనింగ్ మేనేజర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో అయిదు జిల్లాల పంచాయతీ రాజ్ అధికారుల ఆరవ బ్యాచ్ కి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణ పొందిన సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ శిక్షణా కేంద్రం అధికారులు డి.ఎం. సిల్వియా, జె.రాంబాబు, ఎ. గోపాలరావు, టి.ఎల్.ఎన్.కె. రాజా, ఎస్. కె. మొహిద్దిన్, ఆర్.పి.ఎస్. శేషుబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us