హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తానే సమయం ఇస్తున్నానని.. వారంలో నిర్ణయం చెప్పాలని పరోక్షంగా వైసీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో రఘురామ మీడియాతో మాట్లాడారు. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని చెప్పారు. తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకు, రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రఘురామ చెప్పారు.







