UPDATED 27th SEPTEMBER 2022 WEDNESDAY 07:00 PM
Visakha railway zone : ఏపీ, తెలంగాణ విభజన హామీలు..సమస్యల అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీ విభజన హామీల్లో భాగంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అటువంటి వార్తల్ని నమ్మవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై వచ్చిన వదంతులను ఏమాత్రం నమ్మవద్దని స్పష్టంచేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణ పూర్తి అయిందని వెల్లడించారు.







