UPDATED 21st FEBRUARY 2022 MONDAY 04:30 PM
GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అధికార ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరైన రీతిలో నడిపించలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసింది. అనేక నేషనల్ హైవేస్ ను డెవలప్ చేస్తున్నామని, రాబోయే ఆర్థిక సంవత్సరం సుమారు రూ.5వేల కోట్లను కేంద్రం కేటాయించనున్నట్లు తెలిపారు. కాకినాడలో పెట్రో కెమికల్ ప్రాజెక్ట్‌ను అబివృద్ధి చేయాలనుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందకపోవడంతో ముందుకు జరగడం లేదని వివరించారు.
గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల ఎకరాలు చూపిస్తామని చెప్పింది. కానీ చొరవ చూపలేదు. రెండు ప్రభుత్వాలకు కమీషన్‌లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్‌లపై కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారో తెలియదు. రాజకీయంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. ఆవాస్ యోజన పధకం కింద కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ప్రజలకు ఇవ్వలేదు. టీడీపీ చేతకాని ప్రభుత్వం అని అంటే, మీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతుంది.. ఏం చేసినట్లు అని ప్రశ్నించారు.







