కలుషితాహార బాధితులకు కాకినాడ ఎంపీ నరసింహం పరామర్శ

UPDATED 25th OCTOBER 2017 WEDNESDAY 5:00 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై   స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కాకినాడ ఎంపీ తోట నరసింహం బుధవారం పరామర్శించారు. భాదితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. యల్లమిల్లి గ్రామంలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో మాంసాహారం తిన్న సుమారు 55 మందికి వాంతులు, విరోచనాలు అయిన విషయం తెలిసిందే. భాదితులతో ఎంపీ నరసింహం మాట్లాడి భాదితులకు. ధైర్యం చెప్పారు. అనంతరం డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ ఇప్పటికే అధిక శాతం మందిని చికిత్స చేసి డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజాసూరిబాబురాజు, వైస్ ఛైర్మన్ కొరుపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ బొడ్డు బంగారుబాబు, పట్టణ టిడిపి కార్యదర్శి తూతిక రాజు, కుంచే చినబాబు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us