జొన్నాడ, మందపల్లి ఇసుక రీచ్ లలో తవ్వకాలు చేపట్టాలి

UPDATED 3rd MARCH 2018 TUESDAY 6:00 PM

కాకినాడ: జిల్లాలోని జొన్నాడ, మందపల్లి కొత్త ఇసుక రీచ్ లలో కూడా ఇసుక త్రవ్వకాలు చేపట్టడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తి కేయ మిశ్రా ఆదేశించారు. కలక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 28 ఇసుకరీచ్లు ఉన్నాయని, వాటిలో ప్రస్తుతం 17 ఓపెన్ రీచ్లు, రెండు డీ-సెల్టేషన్ సాండ్స్, ఒక పట్టాలాండ్ లో ఈ ఇసుక రీచ్ లు పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటికే వీటికి పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని, అందువలన ఈ రీచ్ లకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలోని ఆత్రేయపురం మండలం రాజవరం, వెలిచేరు, రావులపాలెం మండలం పొడగట్లపల్లి రీచ్ లలో ర్యాంపులు నిర్మించవల్సిఉందని, మిగిలిన రీచ్లు వివిధ కారణాల వల్ల పని చేయలేదన్నారు. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగంకు అవసరమైన ఇసుక వివరాలను వారి నుంచి సేకరించి వంతుల వారీగా ఇసుకను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా జిల్లాలోని చొల్లంగి ఛానల్ ఆధునీకరణ పనులకు కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి ఇసుక రీచ్ నుంచి పంపిణీ చేయాలని కలక్టర్ ఆదేశిస్తూ, ఈ మేరకు నీటి పారుదలశాఖ సూపరింటెండింగ్ ఇంజనీరు వచ్చే 15 రోజులు ఇసుక అవసరతను తెలియజేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక సరఫరాపై సాండ్ ట్రాన్సిట్ పాయింట్లు పంపిణీపై సంబంధిత సబ్ కలక్టర్లు, ఆర్డిఓలు సమన్వయం చేయాలన్నారు. పెద్దాపురంలో జి ప్లస్ 3 పద్ధతిలో నిర్మిస్తున్న గృహాల కోసం ఇసుక పంపిణీ సమీప ఇసుక రీచ్ల నుంచి పంపిణీ చేయాలని పెద్దాపురం ఆర్.డి.ఓను కలక్టరు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్.పి. విశాల్ గున్నీ, జాయింట్ కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, రాజమహేంద్రవరం సబ్ కలక్టర్ సాయికాంత్ వర్మ, గనుల శాఖ ఎడి కె.ఎల్.వి. ప్రసాద్, కాకినాడ, పెద్దాపురం, రామచంద్రదపురం, అమలాపురం ఆర్డీవోలు ఎల్.రఘుబాబు, వి. విశ్వేశ్వరరావు, ఎన్.రాజశేఖర్, బి.వి. రమణ, ఇన్ చార్జి డిటిసి పి. సిరిఆనంద్, గ్రౌండ్ వాటర్ డిడి విజయకుమార్, డిఎస్పీలు ఎ. శ్రీనివాసరావు, ఎస్. మురళీమోహన్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us