Updated 1 February 2022 Tuesday 05:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రైతులు, పేదల కోసం కేంద్రం ఏం చేస్తుందనేది బడ్జెట్ లో చెప్పలేదన్నారు. బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని ఆయన ఆరోపించారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రణాళికలు బావున్నాయని.. డిజిటల్, సోలార్, ఈవీ రంగంలో సంస్కరణలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైసీపీ ఎంపీలు మరోసారి విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని ఆయన నిలదీశారు.







