UPDATED 30th NOVEMBER 2017 THURSDAY 8:00 PM
పెద్దాపురం: ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయుడు బందిలి సతీష్ బాబు కుటుంబానికి పెద్దాపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే సభ్యుల ప్రోత్సాహంతో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో గురువారం ఆర్ధిక సహాయం చేశారు. ఈ సంధర్భంగా కౌన్సిల్ సభ్యుల ద్వారా సేకరించిన రూ.20,500 నగదును మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు చేతుల మీదుగా సతీష్ బాబు భార్యకు అందచేశారు. అనంతరం చైర్మన్ రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న కృషిని అభినందించారు. సంఘ అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ సతీష్ బాబు కుటుంబాన్ని ఆదుకుంటామని పెద్దాపురం యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో హామీ ఇచ్చిన విధంగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కౌన్సిల్ సభ్యులు చేసిన ఆర్ధిక సాయం చేయడం పట్ల ఆయన సంఘం తరపున వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు అడపా వెంకట్రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి మాసా చంద్రరావు (చందు), ఉపాధ్యక్షుడు కోశెట్టి రాంప్రసాద్, కోశాధికారి బద్ది కుమార్, ఇర్షాద్ ఆలీ, సుధాకర్, రాజా శ్రీనివాస్, చంద్రదాసు, వినాయక్, తదితరులు పాల్గొన్నారు.







