Chandrababu: జగన్‌ పాలనంతా.. ‘అప్పులు, తప్పులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు’

వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు : చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: వైసీపీ    పాలనలో పౌరుల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పేపర్లకే పరిమితమని  టీపీడి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్నీ రెండున్నరేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌ పాలన అంతా.. ‘అప్పులు, తప్పులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు’ అని విమర్శించారు. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటం వైసీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ఠ. దాదాపు 30 గంటల తర్వాత జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనం. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తోన్న మీడియకు సంకెళ్లు ఇంకెన్నాళ్లు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘వైసీపీ నాయకులు చెప్పినట్లు చేస్తూ సీఐడీ అధికారులు.. ఆ సంస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసా న్నీ మంట గలుపుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా మీడియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇలాంటి అణచివేత చర్యల వల్ల జగన్‌ ఎంతటి నియంతో అర్థమవుతోంది. తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరు. ప్రజాక్షేత్రంలో తప్పులకు శిక్ష తప్పదు’ అని చంద్రబాబు అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us