రెడ్ బీ న్యూస్, 18 డిసెంబర్ 2021: ఆన్‌లైను క్లాసు జరుగుతుండగా ఓ విద్యార్థి చేతిలోని ఫోను పేలింది. 15 ఏళ్ల ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చంద్ కుయియా గ్రామానికి చెందిన రాం ప్రకాశ్ భదౌరియా 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఫోనులో ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా చేతిలోని ఫోను పేలడంతో అతని దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.







