అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 3న ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మూడు రాజధానుల అంశం, అమరావతి అభివృద్ధి కార్యాచరణ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టే అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. విభజన హామీలు నేరవేర్చాలని జగన్ ప్రధానిని కోరనున్నట్లు సమాచారం. వీటితో పాటు రాష్ట్ర సమస్యలపై మోదీకి ఆయన వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రధానితో పాటు జగన్.. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.







