Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు

Updated 9th January 2023 Monday 10:55 am

Sankranti holidays : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులపై స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 12 నుంచి 17 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది.

అయితే మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. సవరించిన ఉత్తర్వుల ప్రకారం సెలవులను ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 17న ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు సవరించిన సెలవుల షెడ్యూల్ జాబితాను అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పంపించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us