పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 24 అక్టోబరు 2021 : పట్టణ పరిధిలోని భాస్కర్నగర్ని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని సివిల్ సప్ల్సైస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశామని ఎస్ఐ మురళీమోహన్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్టు ఆయన చెప్పారు.







