కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న జవాద్‌

అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: పశ్చిమమధ్య బంగాళాఖాతం నుంచి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో జవాద్‌ తుపాను కోస్తాంధ్రతీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు 360 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 470, పారాదీప్‌కు 530 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది మరింత పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రేపు ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వెల్లడించారు. కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకుని ఒడిశాలోని పూరి దిశగా కదిలే సూచనలు ఉన్నాయని, ఆ తదుపరి కొద్దిగా బలహీనపడి పశ్చిమ్‌ బెంగాల్‌ తీరం దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ గాలుల వేగం 100 కి.మీ కు పెరిగే సూచలు ఉన్నాయని తెలిపారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల 20 సెం.మీ కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us