రైతుల ఆర్ధికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 9th OCTOBER 2017 MONDAY 7:00 PM

సామర్లకోట: ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ వారి ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక టిటిడిసి ఆవరణలో మూడవ విడత రైతు ఋణమాఫీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటూ వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడవ విడత రైతు ఋణమాఫీకి 2.50 లక్షల మంది రైతులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.175 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేసి తీరుతుందన్నారు. అనంతరం పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో 15,582  మంది రైతులకు రూ.10.37 కోట్ల ఋణమాఫీ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి), పాలకుర్తి శ్రీనివాసాచార్యులు(శ్రీనుబాబు), ఎంపిపి గొడతా మార్త, జెడ్పిటిసి సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరావు, ఏడీఏ రత్న ప్రశాంతి, ఏవోలు కొల్లి ద్వారకాదేవి, సామ్యూల్ జాన్, కంటే జగదీశ్ మోహన్, మన్యం చంద్రరావు, ఆకునూరి సత్తిబాబు, వల్లూరి శ్రీనివాసరావు, కుర్రా నారాయణ స్వామి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us