పెద్దాపురం: ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నూతన బస్సు కాంప్లెక్స్ ను, ఆర్ ఎండ్ బీ అతిధి గృహాన్ని, రైతుబజార్ ను ఈ నెల 12 న ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటి ఛైర్మెన్ ముత్యాల రాజబ్బాయి, మున్సిపల్ చైర్మెన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కురుపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మెన్ బోడ్డు బంగారుబాబు, మున్సిపల్ కమీషనర్ ఏ. వెంకట్రావు, కౌన్సిల్లర్లు, అధికసంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.







