ఆదిత్యలో ఎపిఐటి అకాడమి వర్క్ షాప్

UPDATED 2nd SEPTEMBER 2017 SATURDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్  కళాశాలలో ఎపిఐటి అకాడమి ఆధ్వర్యంలో శనివారం వర్క్ షాప్ నిర్వహించారు. అమరావతి నాలెడ్జ్ సెంటర్ (ఎకెసి) సౌజన్యంతో ఐబీఎం క్లౌడ్ బ్లూ మిక్స్ అనే అంశంపై ఈ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎపిఐటికి చెందిన ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనీ ఎన్.వంశీ విద్యార్థులకు శిక్షణతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నూతన విషయాలను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డాక్టర్ ఎస్.రమాశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us