Case Registered Against Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు

UPDATED 12th NOVEMBER 2022 SATURDAY 2:20 PM

Case registered against Janasena chief Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై కేసు నమోదు అయ్యింది. శుక్రవారం (నవంబర్ 11,2022)తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పవన్ ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చుని వెళ్లారని ఎఫ్‌ఐఆర్ నెంబర్ 817/2022గా, ఐపీసీ 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.

ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చొని పవన్‌ వెళ్లడం, డ్రైవర్ రాష్‌ డ్రైవింగ్‌పై కేసులు నమోదు అయ్యాయి. జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించడంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి మారిస్‌ పేటకు చెందిన పి.శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్‌ కల్యాణ్‌, ఆయన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఇతరుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినందుకు ఐపీసీ 336 సెక్షన్ కింద.. అలాగే రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగా ఐపీసీ 279 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us