దీపం పథకంలో అక్రమాలు సహించేది లేదు

UPDATED 21TH MAY 2017 SUNDAY 5:30 PM

పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ ను పొగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకంలో అక్రమాలు జరిగితే సహించేది లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు శనివారం గ్యాస్ స్టవ్ లను అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికీ దీపం పథకంలో భాగంగా గ్యాస్ స్టవ్ లను అందచెయ్యడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, కమీషనర్ శేషాద్రి, పట్టణ టిడిపి  అధ్యక్షుడు రంధి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us