గురు పూర్ణిమ‌పై నాసా ట్వీట్!

UPDATED 8th JULY 2017 SATURDAY 7:00 PM

గురు పూర్ణిమ‌... గురువుల‌ను, పెద్ద‌ల‌ను పూజించే పండుగే గురు పూర్ణిమ‌. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆషాఢ శుద్ధ పౌర్ణ‌మి (జూన్ - జులై) రోజున హిందువులు గురు పూర్ణిమ ను జ‌రుపుకుంటారు. ఈ రోజు వ్యాసుడి పుట్టిన రోజని చ‌రిత్ర చెబుతుంది. గురు పూర్ణిమ రోజు చాలా మంది ఉప‌వాసం ఉండి సాయంత్రం చంద్రుడు ఉద‌యించిన త‌ర్వాత ఆహారం తీసుకుంటారు. ఇది గురు పూర్ణిమ విశిష్ట‌త‌. కొన్ని రోజుల నుంచి గురు పూర్ణిమ విశిష్ట‌త గురించి సోష‌ల్ మీడియా కూడా కోడై కూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే గురు పూర్ణిమ గురించి అమెరికా కు చెందిన నాసా ఓ ట్వీట్ చేసింది. అదే ట్విస్ట్ ఇక్క‌డ‌. గురు పూర్ణిమ 2017 కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసింది నాసా. ఈ సారి గురు పౌర్ణ‌మి రోజున వ‌చ్చే నిండు చంద్రుడికి చాలా పేర్ల‌ను పెట్టింద‌ట‌. గురు పూర్ణిమ‌తో పాటు హే మూన్, రైప్ కార్న్ మూన్, థండ‌ర్ మూన్ పేర్లు పెట్టిన‌ట్లు ట్వీట్ లో పేర్కొన్న‌ది. హిందువులు జ‌రుపుకునే గురు పూర్ణిమ గురించి నాసా ట్వీట్ చేసినందుకు భార‌త్ కు చెందిన నెటిజ‌న్లు నాసా ను తెగ మెచ్చుకుంటున్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us