UPDATED 31st MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆందోళన చెందిన కార్యకర్తలు గురువారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక స్టేషన్ సెంటర్ సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయం, ఆంజనేయస్వామి ఆలయంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అధినేత ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుడిని ప్రార్ధించారు. అలాగే ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిల్లా సురేష్, మానేపల్లి కరుణకుమార్, సారంపాటి లోవాచారి, డేగల భాస్కర్, మాదాల శ్రీను, సి.హెచ్. దుర్గ, భాను, గోపు రాజా, గిరి, దుర్గా ప్రసాద్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







