వేలంపాట ద్వారా రూ.6.63 లక్షల ఆదాయం
(కాండ్రకోట) పెద్దాపురం: మండలంలోని కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానంలో దేవాదాయశాఖఆద్వర్యంలో నిర్వహించిన కేశఖండన (తలనీలాలు పోగుచేసుకునేహక్కు)నకు సంబంధించి వేలంపాట ద్వారా దేవస్థానానికి రూ.6.63 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయకార్యనిర్వహణాధికారి వీవీ పళ్లంరాజు తెలిపారు. ఈనెల 27న నూకాలమ్మఅమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేలంపాటలను నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేవాదాయశాఖ ఇనస్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో ఈవేలం పాటలను నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈకార్యకమ్రంలో ఆలయ చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మి, మార్కెట కమిటి వైస్ చైర్మన్ ఎలిశెట్టి నాని, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సర్పంచ్ కుంచే గాంధీ, ఉపసర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్ పాల్గన్నారు.







