గంజాయి రవాణాపై గట్టి నిఘా : ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్

గంగవరం (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: తూర్పు ఏజెన్సీ గుండా తరలిస్తున్న గంజాయి రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేసి అడ్డుకట్ట వేయడం జరుగుతుందని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అన్నారు. స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లో 5600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయి తరలిస్తున్న 31 వాహనాలను, 68 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గంజాయి రవాణా అడ్డుకట్టవేసేందుకు డివిజన్లో ముఖ్యమైన ప్రదేశాలు 24 గంటలు పనిచేసే విధంగా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.  ఈ చెక్ పోస్టుల కారణంగా కొంతవరకు రవాణా ఆపగలిగామన్నారు. అలాగే గ్రామస్థాయిలో మహిళా పోలీసులు నిఘా వల్ల అరికట్టడం జరుగుతుందన్నారు. గ్రామ మహిళా పోలీసులకు ప్రత్యేక డైరీలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ డైరీలో పలు రంగుల పేజీల ద్వారా గ్రామ క్రైమ్ మిస్సింగ్ కేసులు, కొత్త వ్యక్తుల సంచారం, సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని, ఆ సమాచారాన్ని సర్కిల్ ఇన్సపెక్టర్ సబ్ ఇన్సపెక్టర్ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నత అధికారుల నివేదికలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి రవాణా, నాటు సారా తయారీ, అసాంఘిక కార్యకలాపాలకు గిరిజన యువత దూరంగా ఉండాలని సూచించారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను యువతను చైతన్యపరచడం జరుగుతుందన్నారు. గిరిజన యువత కోసం రంపచోడవరం డివిజన్ స్థాయిలో త్వరలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారూ. ఈకార్యక్రమంలో అడ్డతీగల సర్కిల్ ఇన్సపెక్టర్ రవికుమార్, గంగవరం ఎస్ఐ షరీఫ్ పాల్గొన్నారు.
 
గంగవరం పోలీస్ స్టేషన్ తనిఖీ
 
గంగవరం పోలీస్ స్టేషన్ లో బుధవారం రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళా పోలీసులు కోసం ఏర్పాటుచేసిన డైరీని ఆయన ఆవిష్కరించారు. డైరీలను పంపిణీ చేసి డైరీ నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్సపెక్టర్ రవికుమార్, ఎస్ఐ షరీఫ్ తదితరులు ఉన్నారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us