లోక కల్యాణార్థం ఘనంగా వేద సదస్యం

UPDATED 6th JUNE 2017 TUESDAY 11:45 PM

మామిడికుదురు : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో మూడో రోజు మంగళవారం భక్తుల కోలాహలంతో ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాల భోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం) వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ దేవస్థానాలైన అంతర్వేది, వాడపల్లి, మురముళ్ల, భీమవరం, ఆచంట, ద్వారకా తిరుమల, మందపల్లి, ధవళేశ్వరం నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం, జగత్‌ రక్షణ కోసం వేద సదస్యం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.  సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి. ధర్మకర్తల మండలి చైర్మన్‌ మొల్లేటి శ్రీనివాస్, ఆలయ అసిస్టెంట్ కమీషనర్ పొలమూరి బాబూరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us