Kamareddy Incident : ప్రేమ పేరుతో ఆకతాయి వేధింపులు, అపరకాళి అవతారమెత్తిన యువతి.. చెప్పుతో చితక్కొట్టేసింది..

UPDATED 22nd NOVEMBER 2022 TUESDAY 9:20 PM

Kamareddy Incident : సినిమాల ప్రభావమో మరో ప్రభావమో కానీ, యువత పెడదారి పెడుతోంది. ప్రేమ పేరుతో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ప్రేమించాలని, గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని అమ్మాయిలను వేధిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి పోకిరీల ఆగడాలు ఎక్కువైపోయాయి.

కాగా, కొందరు అమ్మాయిలు మౌనంగా వారి వేధింపులు భరిస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్ గా ఉండిపోతున్నారు. కొందరు అమ్మాయిలు మాత్రం అలా కాదు. అస్సలు ఊరుకోవడం లేదు. అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. వెంటపడి వేధించే ఆకతాయిల పని పడుతున్నారు. నడిరోడ్డుపై పోకిరీలకు బుద్ధి చెబుతున్నారు.

తాజాగా అలాంటి ఘటన ఒకటి కామారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఓ యువతి బుద్ధి చెప్పింది. నడిరోడ్డుపై చెప్పుతో చితక్కొట్టింది.

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆకతాయి.. యువతిని వెంబడించాడు. ప్రేమించాలని వేధించాడు. అంతేకాదు దగ్గరికొచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలని బెదిరించాడు. నెల రోజులుగా అతడు ఇలా వేధిస్తున్నాడు. ఆకతాయి వేధింపులతో విసుగు చెందిన ఆ యువతి సహనం కోల్పోయింది. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంది. అపరకాళి అవతారమెత్తింది. ఆకతాయిని చితక్కొట్టింది. వాడి గల్లా పట్టుకుని చితకబాదింది. కాళ్లతో తంతూ పిడిగుద్దులు కురిపించింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదు. చెప్పుతో చితక్కొట్టింది. వాడికి తగిన శాస్తి చేసింది.

రోడ్డు మీద వెళ్తున్న వాళ్లు ఇది గమనించి అక్కడికి వచ్చారు. జరిగింది ఆ యువతి వారికీ చెప్పింది. దీంతో వారు ఆకతాయిని పట్టుకోవడంతో.. యువతి మరో నాలుగు పీకింది.

ప్రేమ పేరుతో నెల రోజులుగా ఆకతాయి తనను వేధిస్తున్నాడని ఆ యువతి వాపోయింది. ఇంటి నుంచి వీధిలోకి రాగానే తన వెంటనే పడే వాడని.. మధ్యలో మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడంది. మాట్లాడుకుందామని ఫోన్ నెంబర్ కావాలని అడిగేవాడంది. చాలా రోజుల పాటు పట్టించుకోలేదంది. అయినా వాడు వదిలి పెట్టలేదని, చివరికి ప్రేమిస్తున్నానని పెద్ద పెద్ద మాటలు చెప్పాడంది. దీంతో తానిక భరించలేకపోయానని, బుద్ధి చెప్పాల్సి వచ్చిందంది.

కాగా.. ఆ యువతి సడెన్ గా అలా రియాక్ట్ అయ్యే సరికి ఆకతాయికి దిమ్మతిరిగిపోయింది. నడిరోడ్డులో అందరి ముందు చెప్పుతో కొట్టడంతో అవమానంగా ఫీల్ అయ్యాడు. తప్పైపోయింది.. క్షమించండి అంటూ లెంపలేసుకున్నాడు.

యువతి ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. పోకిరీకి సరైన రీతిలో సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఇలాంటి పోకిరీలకు.. చెప్పుతో బుద్ది చెప్పకపోతే.. మరింత రెచ్చిపోతారని కామెంట్ చేశారు. వేధింపులను భరిస్తూ, మౌనంగా ఉంటే.. మహిళల అసహాయతను ఆసరాగా చేసుకుని మరిన్ని దారుణాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us