UPDATED 23 JANUARY 2022 SUNDAY 6:00AM
తిరుమల (రెడ్ బీ న్యూస్): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 13 నుంచి ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం శనివారం రాత్రి వైభవంగా ముగిసింది. అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాలను మూసివేశారు. వైకుంఠ ఏకాదశికి భారీగా భక్తులు వస్తారనే ఉద్దేశ్యంతో టీటీడీ 43 వేల నుంచి 45 వేల వరకు టికెట్లను జారీ చేయగా.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మొదటి రెండు రోజులు మినహా మిగిలిన రోజుల్లో టీటీడీ అంచనా కన్నా తక్కువగానే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.







