సామాన్యుడిపై ‘సమ్మె’ట!

* వేతన సవరణకు బ్యాంకర్ల సమ్మె 
* దరిచేరని సేవలు.. తెరుచుకోని ఎటిఎంలు 
* పైసా దొరక్క తల్లడిల్లిన సామాన్య జనం 
UPDATED 30th MAY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: వేతన సవరణ వెంటనే చేపట్టాలని కోరుతూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు బుధవారం పట్టణంలోని బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రభావం సామాన్యుడిపై కనిపించింది. బ్యాంకులన్నీ మూతపడటంతో మళ్లీ కరెన్సీకి కటకట ఏర్పడింది. చాలా వరకు ఏటీఎంలు పని చేయలేదు. వేతన జీవులు మాత్రం ఒకటో తేదీన పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనతో కనిపించారు. అక్కడక్కడ ఏటీఎంలు తెరిచి కనిపించినా అందులోని నగదు ఉదయాన్నే అయిపోయింది. సమ్మె నేపథ్యంలో పట్టణంలో బ్యాంకులు మూతపడడంతో ఖాతాదారుల సేవలకు అంతరాయం కలిగింది. దీనికితోడు ఏటీఎంలు ఎక్కడా తెరుచుకోక పోవడంతో సామాన్యులకు చుక్కలు కన్పించాయి. సమ్మె గురువారం కూడా కొనసాగనున్న తరుణంలో ఏం చేయాలో పాలుపోక సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలకు అలవడిన కొన్ని వ్యాపార వర్గాలు డిజిటల్‌ లావాదేవీలతో కొంత ఉపశమనం పొందినా, బ్యాంకుల్లో నగదు జమ చేసే వ్యాపారులు మాత్రం ఇబ్బంది పడ్డారు. 
 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us