కోవిడ్-19 సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్స్

అమలాపురం,15 మే 2020, (రెడ్ బీ న్యూస్): అమలాపురం డివిజన్ లో కోవిడ్-19 పై ప్రజలకు ఎటువంటి సందేహాలు,సమస్యలు ఉన్నా అవసరమైన సలహాలు కోసం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08856 233208 కు ఫోన్ చేయవచ్చునని అమలాపురం ఆర్డీవో బి.హెచ్.భవానీ శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ప్రధానంగా లారీ డ్రైవర్ లు, క్లీనర్లు,అలాగే వలస కార్మికులు, డివిజన్ లోకి ప్రవేశించి కరోనా లక్షణాలతో కనిపిస్తే పైన తెలిపిన టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని ఆర్డీవో కోరారు. వీరి సమస్యల పరిష్కారం నిమిత్తం కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్, పారిశుధ్య శాఖల నుంచి అధికారులను అందుబాటులో ఉంచడం జరిగిందని, వీరు కరోనాపై ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆర్డీవో పేర్కొన్నారు.డివిజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వై.ఎస్.ఆర్. రైతు భరోసా పథకం పై రైతులకు, ప్రజలెవరికైనా సందేహాలు ఉంటే అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08856 233100 కు ఫోన్ చేయవచ్చునని ఆర్డీవో భవానీ శంకర్ తెలియ చేశారు.అలాగే డివిజన్ లో మత్స్య శాఖ కు సంబంధించి ఆక్వా కల్చర్ కు సంబంధించి సలహాలు, అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలన్నా, అలాగే డివిజన్ లో చిన్న పిల్లలకు సంబంధించిన సమస్యలు పోషకాహార లోపం తదితర సమస్యల పరిష్కారానికి కూడా ఆర్డీవో కార్యాలయంలో 08856 233101 నంబర్ తో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియ చేశారు. పైన తెలిపిన టోల్ ఫ్రీ నెంబర్ లతో ఆయా సమస్యలను ప్రజలు పరిష్కరించు కోవచ్చు నని ఆయన తెలియ చేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us