సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

UPDATED 27th SEPTEMBER 2017 WEDNESDAY 6:30 PM

పెద్దాపురం: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన తూర్పుగోదావరి జిల్లా  పెద్దాపురం పట్టణంలో జిల్లా స్థాయిలో నిర్వహించబోయే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2 జె. రాధాకృష్ణమూర్తి కోరారు. ఈ సందర్భంగా ఆయన పెద్దాపురం పట్టణంలో బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు అక్టోబర్ రెండవ తేదీన ఈ గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. అలాగే జిల్లాలో 12 వేల కుటుంబాలు ఉండగా 40 కుటుంబాల దంపతులు ఈ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ దంపతుల చేత ప్రభుత్వం తరఫున పలు పూజా కార్యక్రమాలతో పాటు బట్టలు అందచేయడం జరుగుతుందన్నారు. అనంతరం స్వచ్ఛతే సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా వోడీఎఫ్ గా ఎంపికైన పంచాయతీ సర్పంచ్ లను సన్మానించడం జరుగుతుందని, వ్యాసరచన, పెయింటింగ్, మొదలైన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరుగుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకటరావు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొంటారన్నారు. అనంతరం రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న గాంధీ పార్క్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ సీఈవో మల్లిబాబు, హోసింగ్ పిడి జి.వి. ప్రసాద్, ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, హోం మంత్రి పిఎ నిమ్మకాయల సుబ్బారావు, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ బి. శ్రీనివాస్, లేబర్ ఇనస్పెక్టర్ రఘుపతి, హోసింగ్ ఈఈ సుధాకర్ పట్నాయక్, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపిడివో వసంత మాధవి, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us