శ్రీ ప్రకాష్ లో ముగిసిన వేసవి శిబిరం

UPDATED 14TH MAY 2017 SUNDAY 6:00 PM

పెద్దాపురం : పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో రెండువారాల పాటు నిర్వహించిన వేసవి శిక్షణా  శిబిరం ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. ముగింపు సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, రూపకాలు, ఆటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ శిక్షణా శిబిరంలో విద్యార్థులకు ప్రముఖులు యోగా, క్రీడలు,నృత్యం, దర్శకత్వం, కంప్యూటర్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ అనంతరం తాము నేర్చుకున్న అంశాలన్నీ విద్యార్థులు ప్రదర్శించారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి సుమారు 130 మంది విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. డాక్టర్ ముత్తా శశికళ, డాక్టర్ ఆర్ వి రమణమూర్తి, డాక్టర్ అంజలి మార్గ దర్శకం చేశారు. పడాల సూర్యప్రసాద్, యలమంచిలి రాజేష్ మార్గనిర్దేశం చేశారు. అలాగే ఎఎస్పి వై.రవిశంకరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్  డైరక్టర్ చిట్టూరి విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవివిఎస్.మూర్తి, డీన్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us