Updated: 11th April 2017 Tuesday 2:30 PM
పెద్దాపురం: రైతులకు గిట్టుబాటు ధర అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామ పిఎసిఎస్ అధ్యక్షుడు చల్లా చినవీరాజు (చిన్ని) పేర్కొన్నారు. పిఎసిఎస్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంటలకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం రకం రూ.1510 , సాధారణ రకం రూ.1470 గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సీఈవో పి ఎస్ వి ఎన్ ఆచార్యులు, పిట్టు రంగారావు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.







