UPDATED 8th JULY 2022 FRIDAY 12:50 PM
YS vijayamma: వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని వైఎస్ విజయమ్మ ప్రకటించారు. ఇవాళ ఆమె వైసీపీ ప్లీనరీలో మాట్లాడారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. విమర్శలకు తావు ఇవ్వకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణలో షర్మిల పెట్టిన పార్టీకి తాను అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రజలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎక్కడైనా అధికారం కోసమే పార్టీలు పుడతాయని, అయితే, ఏపీలో ప్రజలకు ఇచ్చిన మాట కోసమే వైసీపీ పుట్టిందని ఆమె చెప్పారు. మొదటి నుంచీ వైసీపీకి అండగా ప్రజలు ఉన్నారని అన్నారు.







