UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 5:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు సామర్లకోట మండలం ఉండూరులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి ఫీల్డ్ ట్రిప్ నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసి వాటి నుంచి కంపోస్ట్ ఎరువులు తయారు చేసే విధానాలు తెలుసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కళాశాల అధ్యాపకులు ఎం. ప్రశాంతి, ఎస్. భార్గవి, కె. చంద్రశేఖర్ సారథ్యంలో సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీమ్ ను అభినందించి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు పరిసర ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉండూరు పంచాయతీ కార్యదర్శి ఇందిరాదేవి, తదితరులు పాల్గొన్నారు.







