నేషనల్స్ కు ఆదిత్య విద్యార్థి ఎంపిక

UPDATED 25th MAY 2017 THURSDAY 2:00 PM

గండేపల్లి : జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కి చెందిన ప్రథమ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఎ.ఎం.ఈశ్వర్ కుమార్ యాదవ్ ఎంపిక అయినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు అనంతపురంలో జరిగిన పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాకు ప్రాతినిధ్యం వహించి బెస్ట్ షూటర్ గా విశేష ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మూడవ అంతర్ జిల్లాల బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ 2017 పోటీల్లో విజేతలను ప్రశంసా పత్రాలు, గోల్డ్ మెడల్స్ తో  సత్కరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈశ్వర్ కుమార్ యాదవ్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, నీలిమ తదితరులు అభినందించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us