UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 01:15 PM
యాదాద్రి: యాదాద్రి ఆలయం నిర్మాణం అద్భుతం.. ఈ కాలంలో ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు ఏపీ ఎమ్మెల్యే రోజా. 2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం ఆమె యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని కొనియాడారు. గతంతో పోలిస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారన్నారు. భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు







