ముందుచూపున్న మహోన్నత మహాకవి గురజాడ

UPDATED 30th NOVEMBER 2017 THURSDAY 7:30 PM

పెద్దాపురం: దేశంపై, సమాజంపై ఎంతో ప్రేమతో దేశభక్తి గీతరచన గురజాడ చేశారని సాహితీ స్రవంతి అధ్యక్షులు డాక్టర్  జోశ్యుల కృష్ణబాబు అన్నారు. సోషల్ మీడియా ఫర్ సోసైటీ (ఎస్ యం ఎస్) ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 102వ వర్దంతి సభను స్థానిక సాగర్ జూనియర్ కళాశాలలో ముక్తార్ ఆలీ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన కృష్ణబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశం వారైనా పాడుకునే దేశభక్తి గీతం "దేశమును ప్రేమించుమన్నా" అని అన్నారు. ఈ గీతం 1910 లో రాయడం జరిగిందని, నేటికీ యువతకు ఆదర్శవంతమైన గీతమని,  ప్రతివిద్యార్ది, యువకుడు, ప్రతీ పౌరుడు నేర్చుకోవాల్సిన గీతమని తెలిపారు. కన్యాశుల్కం లాంటి మహోన్నత నాటకాన్ని ఆయన చాలా సాహసోపేతంగా రాశారని, అందులోని పాత్రలు నేటికి సజీవ సాక్షాలుగా ఆనాటి పరిస్ధితులను తెలియజేస్తాయన్నారు. పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో గురజాడ గీతంతో ప్రచురించిన కరపత్రాలను ఎస్.ఎమ్.ఎస్ టీం పంపిణి చేశారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు డి.కృష్ణ, ఆర్.వీర్రాజు, ఎమ్.రాంబాబు దేశభక్తి గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎమ్ఎస్ ప్రతినిధులు కొల్లి దుర్గా ప్రసాద్, హరి బళ్ళమూడి, నవీన్ నాని, వంగలపూడి సురేష్, శ్యామ్ తాళ్ళూరి, తాడిగడప సుబ్బారావు, మణికంఠ, సుధాకర్, ఇర్షద్, క్రాంతికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ అచ్యుతరామయ్య, అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us