విలేఖరుల పై దాడులు సహించం

Updated 19th April 2017 Wednesday 9:00 PM

పెద్దాపురం : రాజమహేంద్రవరం లో టీవీ 5 ప్రతినిధులు సురేష్, ప్రసాద్ ల పై  దాడికి పాల్పడిన గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ ఆసుపత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం క్యాంపు కార్యాలయంలో పెద్దాపురం నియోజకవర్గ  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హోం మంత్రికి వినతిపత్రాన్ని అందచేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై హోం మంత్రి రాజమహేంద్రవరం ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. అలాగే దాడిలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని  ఆదేశించారు. జర్నలిస్టులు పై దాడులకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు చల్లా  విశ్వనాధం, రాకుర్తి రాంబాబు, బూరాడ శ్రీనివాసరావు, వినాయక్, ఆలీ, మున్ని, సుధాకర్, సుబ్రహ్మణ్యం ( సుబ్బు ), శ్రీకాంత్,  ఎస్ ఎల్ రెడ్డి,  రాజా, సురేంద్ర, చవ్వాకుల ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. .          

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us