మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

UPDATED 21st NOVEMBER 2018 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: మైనార్టీ కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం పట్టణంలో 28, 4వ వార్డులలో రూ. 35 లక్షలతో నిర్మించ తలపెట్టిన సూర్యబలిజ, నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మైనార్టీ కుటుంబాలను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అదే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైనార్టీ సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. సూర్యబలిజ కమ్యూనిటీ భవనానికి ఎఎంజి సంస్థ 12 సెంట్లు స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం హర్షనీయమన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉత్తమ విద్య అందించి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడటానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో రాజీలేని పధంలో అభివృద్ధి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ సూరిబాబురాజు మాట్లాడుతూ సూర్యబలిజ, నాయీబ్రాహ్మణులు కలలు గన్న కమ్యూనిటీ భవనాలు మంత్రి చొరవతో ఈ రోజు శంకుస్థాపన  చేసుకున్నామని, సూర్యబలిజ కమ్యూనిటీ భవనానికి ఏఎంజి సంస్థ అధిపతి మోజేష్ 12 సెంట్లు స్థలం కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఈ కమ్యూనిటీ భవనానికి దివంగత జాన్ డేవిడ్ పేరు నామకరణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, జిల్లా సూర్యబలిజ సంఘం అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం, పెద్దాపురం పట్టణ  సూర్యబలిజ సంఘం అధ్యక్షులు అన్నాబత్తుల అంజిబాబు, జివికె మోహనరావు, ధరణికోట సత్తిబాబు, యూత్ ప్రెసిడెంట్ యోహాన్, మద్దుల వీరబాబు, కౌన్సిలర్లు, కోటిపల్లి నారీమణి, రత్నమాల, 4వ వార్డు కౌన్సిలర్ దుర్గాభవాని, నాయీబ్రాహ్మణ, సూర్యబలిజ యూత్ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us