UPDATED 30th SEPTEMBER 2022 FRIDAY 05:00 PM
భూమి సర్వే కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వైనం
గ్రామ సచివాలయంలో విచారించిన ఏసీబీ అధికారులు
జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షా పథకంలో రిపోర్టు అనుకూలంగా ఇచ్చేందుకు డబ్బు డిమాండ్
14400 నెంబరుకు ఫోన్ చేసిన బాధితుడు
వివరాలు వెల్లడించిన ఏసీబీ ఏఎస్పీ సౌజన్య
ACB Raid : జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షా పథకంలో రీసర్వే రిపోర్టు అనుకూలంగా ఇచ్చేందుకు రూ.10 వేలు నగదు తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడో సచివాలయ ఉద్యోగి. అందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ ఏఎస్సీ సౌజన్య (Sowjanya) శుక్రవారం విలేఖరులకు వెల్లడించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట (Kandrakota) గ్రామ సచివాలయంలో పి. నాగేశ్వరరావు (P. Nageswarao) విలేజ్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. కాకినాడకు చెందిన నూకరాజు (Nookaraju) అనే రైతుకు గ్రామంలో ఉన్న 10.02 ఎకరాల భూమికి ఇటీవల సర్వే జరిగింది. అయితే ఆసర్వేకు సంబంధించి మరో 11 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకకపోవడంతో రీసర్వే చేసి రికార్డుల్లో ఆ 11 సెంట్ల భూమిని నమోదు చేసేందుకు విలేజ్ సర్వేయర్ నాగేశ్వరరావును ఆ రైతు సంప్రదించాడు.
సర్వేయర్ నాగేశ్వరరావు రైతు నూకరాజును రూ.10 వేలు లంచం (Bribe) ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ రైతు 14400 నంబర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ ఏఎస్సీ సౌజన్య తన సిబ్బందితో కాండ్రకోట సచివాలయం (Sachivalayam) వద్ద నిఘా ఉంచారు.
రైతు నూకరాజు సర్వేయర్ నాగేశ్వరరావుకు రూ. 10 వేలు నగదును అందించిన వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ చేతులను పరీక్షించిన తరువాత వేలిముద్రలు (Finger prints ) సరిపోలడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే అతనిని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. ఈదాడుల్లో ఏసీబీ అధికారులు వి. పుల్లారావు (V.Pullarao), డి. వాసుకృష్ణ (D.Vasukrishna), వై. సతీష్ (Y.Satish), బి. శ్రీనివాస్ (B.Srinivas), విల్సన్ (Wilson) తదితరులు ఉన్నారు.







