Crime News: దారుణం..డ్రగ్స్‌ ఇచ్చివిద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

ముజఫర్‌నగర్ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021‌: పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాదకద్రవ్యాలు ఇచ్చిన ఇద్దరు దుండగులు అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మైనర్‌ బాలిక గురువారం ప్రైవేటు క్లాసుకు వెళ్లగా.. అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు మాదకద్రవ్యాలు ఇచ్చారు. అనంతరం బాధితురాలిని సాద్‌పుర్‌ గ్రామం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారని బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరికి తోడయ్యారని, ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టి.. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. మత్తు నుంచి తేరుకున్నాక తనపై జరిగిన దారుణం గురించి ఆమె కుటుంబసభ్యులకు వివరించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us