AP News: ఆ పథకాలకు పేర్లు మార్చండి.. లేదంటే మేమే మార్చేస్తాం: సోము వీర్రాజు

బాపట్ల (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన పథకాలకు ఏపీ ప్రభుత్వం ప్రధాని మోదీ పేరు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. పేర్లు మార్చకపోతే భాజపా రాష్ట్ర శాఖే రంగంలోకి దిగి మారుస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలకు మోదీ పేరు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిశారని.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేను కేంద్ర ప్రభుత్వమే చేపట్టిందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us