Updated 25th April 2017 Tuesday 11:30 AM
పెద్దాపురం : ప్రజారోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ బొడ్డు బంగారుబాబు పేర్కొన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహనా ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే దోమల దండయాత్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి దోమలను నిర్మూలించి ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్ట హిమబిందు మాట్లాడుతూ దోమల వల్ల అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని, ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే దోమలు వ్యాప్తి చెందకుండా జాగత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వర్మ, మలేరియా అధికారి పి. ఉమామహేశ్వరరావు, డిపిఎంవో రామకృష్ణ , శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







