UPDATED 1st APRIL 2022 FRIDAY 11:30 PM
TTD Temple: నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ శనివారం శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరుగనుంది.
ఈ పర్వదినం సందర్భంగా ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7గంటల నుండి 9గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
అదే సమయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.